కన్నులుండి చూడలేవ యేసు మహిమను

కన్నులుండి చూడలేవ యేసు మహిమను

చెవులుండి వినలేవ యేసు మాటను (2)

నాలుకుండి పాడలేవ యేసు పాటను

కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను      ||కన్నులుండి||

 

చెడును చూడకుండ నీ కనులను

చెడును వినకుండ నీ చెవులను (2)

చెడును పలుకకుండ నీ నాలుకన్

చెడులో నడువకుండ నీ కాళ్ళను

దూరముగా నుంచు ఓ సోదరా

దూరముగా నుంచు ఓ సోదరీ (2)        ||కన్నులుండి||

 

దుష్టుల ఆలోచన చొప్పునా

నడువక సాగుమా నీ యాత్రలో (2)

పాపుల మార్గమందు నీవు నిలువక

అపహాసకులు కూర్చుండు చోటను

కూర్చుండకుమా ఓ సోదరా

కూర్చుండకుమా ఓ సోదరీ (2)         ||కన్నులుండి||

 

యెహోవా దొరుకు కాలమందునా

ఆయనను మీరు వెదక రండి (2)

ఆయన మీ సమీపమందు నుండగా

ఆయననూ మీరు వేడుకొనండి

ఆయన తట్టు తిరుగు ఓ సోదరా

 

ఆయన తట్టు తిరుగు ఓ సోదరీ (2)       ||కన్నులుండి||