కన్నీరే మనిషిని బాధిస్తుంది – ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది

కన్నీరే మనిషిని బాధిస్తుంది

ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది (2)

కన్నీరే కాదనుకుంటే

ఓదార్పే కరువైపోతుంది (2)        ||కన్నీరే||

 

కన్నీరే మరియను బాధించింది

ఆ కన్నీరే మరణము గెలిపించింది (2)

కన్నీరే కాదనుకుంటే

లాజరు తిరిగి బ్రతికేనా (2)

కన్నీరే వలదనుకుంటే

దేవుని మహిమ కనిపించేనా (2)        ||కన్నీరే||

 

కన్నీరే హన్నాను బాధించింది

ఆ కన్నీరే కుమారుని దయచేసింది (2)

కన్నీరే కాదనుకుంటే

సమూయేలు జన్మించేనా (2)

కన్నీరే వలదనుకుంటే

 

దేవుని కృపను గాంచేనా (2)        ||కన్నీరే||