కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కన్నీరేలమ్మాకరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కలవరపడకమ్మాకరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కరుణ చూపి కలత మాన్పె (2)

యేసే తోడమ్మా                             ||కన్నీరేలమ్మా||

 

నీకేమీ లేదని ఏమీ తేలేదని

అన్నారా నిన్ను అవమాన పరిచారా

తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని

రేపటిని గూర్చి చింతించుచున్నావా

చింతించకన్న యేసు మాటలు మరిచావా

మారాను మధురంగా మార్చెను చూసావా (2)         ||కన్నీరేలమ్మా||

 

నీకెవరూ లేరని ఏం చేయలేవని

అన్నారా నిన్ను నిరాశపరచారా

పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని

నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా

నేనున్నానన్న యేసు మాటలు మరిచావా

 

కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2)             ||కన్నీరేలమ్మా||