కనులున్నా కానలేని చెవులున్నా వినలేని

కనులున్నా కానలేని చెవులున్నా వినలేని (2)

మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని (2)

వాడను యేసయ్యా

ఓడిపోయిన వాడను (2)         ||కనులున్నా||

 

అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని

దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని

యేసయ్యా నన్ను విడువకయ్యా (2)

దిక్కులేని వాడను

వాడను యేసయ్యా

చెదరిపోయిన గూడును (2)      ||కనులున్నా||

 

భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని

భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని

యేసయ్యా నన్ను కరుణించుమా (2)

ఫలములేని వాడను

వాసిని యేసయ్యా

పేరుకు మాత్రమే విశ్వాసిని (2)     ||కనులున్నా||

 

బోధ ఉన్నా బ్రతుకులేని

పిలుపు ఉన్నా ప్రయాసపడని

సేవ ఉన్నా సాక్ష్యములేని

సంఘము ఉన్నా ఆత్మలులేని

యేసయ్యా నన్ను నింపుమయ్యా (2)

ఆత్మలేని వాడను

పాదిరిని యేసయ్యా

 

మాదిరి లేని కాపరిని (2)          ||కనులున్నా||