కనుగొంటిని నిన్నే ఓ నజరేయా – సమర్థుడవని సహాయము చేయ..

కనుగొంటిని నిన్నే ఓ నజరేయా – సమర్థుడవని సహాయము చేయ..

నీ ప్రభావము – నాలోకి చేరగా – నా స్వరూపమూ – మారిపోయెగా..

 

1.  ప్రయత్నాలు చేసి వేసారియుంటిని – ఉన్న ఆస్తినంతా చేజార్చుకొంటిని..

     వైద్యులచుట్టూ – కాళ్లు అరిగేటట్టు – ఎంతతిరిగినా – సరికాక యుంటిని..

 

2.  స్వంతజనులతోనే వెలివేయబడితిని  – అపనిందలపాలై మతిపోయి చెడితిని..

     బ్రతుకెందుకని – మనసే చంపుకుని – జీవశ్చవమై – ఇల మిగిలియుంటిని..

 

3.  నీ మహిమను గూర్చి వార్తలను వింటిని – స్వస్తపరచు దేవా నిను నమ్ముకొంటిని..

 

     ధైర్యములేక – ఎదురుగ రాలేక – వెనుకనుండి వచ్చి నిను ముట్టుకుంటిని..