కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి

కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి

నీవే ఆధారం తండ్రి (2)

దయామయా నీ చూపులతో

దావీదు తనయా నీ పిలుపులతో

నీ రూపము కనిపించే

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)       ||కని||

 

నీ పద ధూళులు రాలిన నేలలో

మేమున్నామంటే భాగ్యం ఉందా ఇంతకంటే

చల్లని నీ చేతులు తాకి

పులకితమైపోయే బ్రతుకే పునీతమైపోయే

కనులారా కంటిమి నీ రూపం

మనసారా వింటిమి నీ మాట

ఇది అపురూపం ఇది అదృష్టం

ఏమి చేసినామో పుణ్యం

 

మా జీవితాలు ధన్యం          ||హల్లెలూయా||