కడవరి దినములలో రావాలి ఉజ్జీవం

కడవరి దినములలో రావాలి ఉజ్జీవం యేసుని అడుగులలో నడవాలి యువతరం భావి భారత పౌరులారా – కదలిరండి ఉత్తేజంతో క్రీస్తు రాజ్యపు వారసులారా – తరలిరండి ఉద్వేగంతో

1.      క్రీస్తు సిలువను భుజమును మోస్తు – ఆసేతుహిమాలయంయేసు పవిత్ర నామం ఇలలో మారు మ్రోగునట్లువిగ్రహారాధనను భువిపై రూపు మాపే వరకుభారత దేశం క్రీస్తు రాకకై సిద్దమయ్యే వరకుకదలి రావాలి యువజనము – కలసి తేవాలి చైతన్యం (2)

భావి భారత పౌరులారా – కదలిరండి ఉత్తేజంతోక్రీస్తు రాజ్యవారసులారా – తరలిరండి ఉద్వేగంతో

2.      కులము, మతము మనిషికి రక్షణ ఇవ్వవని నినదించండియేసుక్రీస్తు ప్రభువే ఇలలో లోక రక్షకుడనుచుమూఢ నమ్మకాలు భువిపై సమసిపోయే వరకుఅనాగరికులు, మతోన్మాదులు – మార్పు చెందేవరకుకదలి రావాలి యువజనము – కలసి తేవాలి చైతన్యం (2)

 

భావి భారత పౌరులారా – కదలిరండి ఉత్తేజంతోక్రీస్తు రాజ్యవారసులారా – తరలిరండి ఉద్వేగంతో