ఓ సంఘమా-సర్వాంగమా-పరలోకపు రాజ్య ప్రతిబింబమా

ఓ సంఘమా-సర్వాంగమా-పరలోకపు రాజ్య ప్రతిబింబమా

మెస్సయ్యను-ఎదుర్కొనగా-నీతి నలంకరించి సిద్ద పడుమా

ఓ సంఘమా -వినుమా

 

1 రాణి ఓఫెరు అపరంజితో-స్వర్ణ వివర్ణ వస్త్ర దారణతో

వీణ వాద్య తరంగాలలో-ప్రాణేశ్వరుని ప్రసన్నతతో

ఆనంద తైలసుగంధాభిషేఖము నొందితివే సువాసనుండా

 

2 క్రీస్తే నిను ప్రేమించెనని- తన ప్రాణాలర్పించెనని

స్వస్థ పరచే నిర్దోషముగా-ముడుత కళంకము_లేనిదిగా

మహిమ యుక్తంబుగా-నిలువ గోరె యేసువా

సహించుతావా తీర్పునాడు

 

3 చీకటిలో నుండి వెలుగునకు-లోకంలో నుండి వెలుపలకు

శ్రీ కర్త గుణతిశయములను-ప్రకటించుటకే పిలచేనని

గుర్తించు చుంటివా క్రియలను గంటివా-సజీవముగా నున్నావా

 

4వ్యభిచారులు నరహంతకులు-పోకిరి చేష్టల డాంబికులు

అ బధ్ద జనకుని యాసనము-యెజెబెలు నీ మధ్య నివచించెనా-

కృపావరములు-ఆత్మల బారములు ఉజ్జీవ దాహము కలదా

 

5 చల్లగనైనా  వెచ్చగనూ ఉండిన నాకిది మేలగును

నులి వెచ్చని స్థితి నీకుంటే-బయటకు ఉమ్మబడెదవేేమో

నీ మనస్సు మార్చుకో-తొలి ప్రేమ కూర్చుకో

ఆసక్తి తోడ రక్షణ నొందు

 

6 కడుపటి బూర మ్రోగగానే -కనురెప్ప పాటున మారుదువా

వడిగా మేఘాసీనుడవై -నడియాకాశము పోగలవా

గొఱ్ఱెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా-రారాజు నెదుర్కొనగలవా