ఓ మానవ నీపాపం మానవా

ఓ మానవ నీపాపం మానవా

యేసయ్య చెంతచేరి నీ బ్రతుకు మార్చవా !!2!!

పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీదేహము

పాపములోనే మరణించినచో తప్పదు నరకము !!2!!

1.ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువూ

ఎంతకాలము శాపముతో కొట్టబడుదువూ..

ఎంతకాలము వెసనపరుడవై తిరుగుచుందువూ

ఎంతకాలము దుఃఖములో మునిగియుందువూ

యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము

యేసయ్యా తన రక్తంతో నీపాపము కడుగుము !!2!!

2.ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు

ఎంతకాలము దేవుని లేక బ్రతుకుచుందువూ

ఎంతకాలము దేవుని మాటను ఎదిరించేదవూ

ఎంతకాలము దేవునినే దుఃఖపరతువూ

యేసయ్యా నీపాపము కొరకు ప్రాణము పెట్టెను

 

యేసయ్యా నిను రక్షించి పరమైన చేర్చును !!2!!