ఓ మానవా.. నిజమేదో ఎరుగవా -ఓ మానవా.. ఇకనైనా మారవా

ఓ మానవా.. నిజమేదో ఎరుగవా -ఓ మానవా.. ఇకనైనా మారవా

మన పాపములను క్షమియించుటకే -సిలువ మరణము పొందెనని 2

గ్రహియించి నేడు ఆ యేసు ప్రభుని వేడు (2)

1.. ఈ దినమే అనుకూలంలేదిక వేరే ఏ సమయం

నిజమేదో తెలియకనే చనిపోతే నీ గతి ఏమి? (2) ॥ఓ మానవా॥

2.. సిలువను గూర్చిన శుభ వార్త వెర్రితనముగా ఉన్నాదా?

దేవుని శక్తని తెలుసుకొని ప్రభు మార్గమును చేరెదవా?2”ఈ దినమే

3.. ప్రయాసముతో భారము మోసే నిన్నే దేవుడు పిలిచెనుగా

ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద వేగిరమే పరుగిడి రావా 2 ॥ఈ దినమే॥

4.. నీ ధనము నీ ఘనము నీ సర్వస్వము చితి వరకే

 

అర్పించుము నీ హృదయమును రక్షకుడైన ప్రభు కొరకే (2)      ఈ దినమే॥