ఓ మానవా.. నిజమేదో ఎరుగవా

ఓ మానవా.. నిజమేదో ఎరుగవా
ఓ మానవా.. ఇకనైనా మారవా
మన పాపములను క్షమియించుటకే
సిలువ మరణము పొందెనని (2)
గ్రహియించి నేడు ఆ యేసు ప్రభుని వేడు (2)
ఈ దినమే అనుకూలం
లేదిక వేరే ఏ సమయం
నిజమేదో తెలియకనే
చనిపోతే నీ గతి ఏమి? (2)     ||ఓ మానవా||

సిలువను గూర్చిన శుభ వార్త
వెర్రితనముగా ఉన్నాదా?
దేవుని శక్తని తెలుసుకొని
ప్రభు మార్గమును చేరెదవా? (2)           ||ఈ దినమే||

ప్రయాసముతో భారము మోసే
నిన్నే దేవుడు పిలిచెనుగా
ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద
వేగిరమే పరుగిడి రావా (2)          ||ఈ దినమే||

 

నీ ధనము నీ ఘనము
నీ సర్వస్వము చితి వరకే
అర్పించుము నీ హృదయమును
రక్షకుడైన ప్రభు కొరకే (2)           ||ఈ దినమే||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *