ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము – విరిగిన మనస్సుతో నే వేడెదను

ఓ ప్రభువా ఉజ్జీవము నిమ్ము

విరిగిన మనస్సుతో నే వేడెదను

 

1.. కోల్పోయితిని మొదటి ప్రేమను -చల్లారిపోయె నీ ప్రేమ నాలో నాలో

నిలుపుము నీదు ప్రేమ  (ఓ ప్రభువా)

 

2.. పడినవారి యాశ్రయమా -విడువ బడిన వారి సహయుండా

గాయపు చేతితో లేపుమా(ఓ ప్రభువా)

 

3.. శత్రుని యురిలో చిక్కియున్నాను – నాదు బంధకమును

 తెంపుము నీవు ఆనందము నిమ్ము మరల నాకు(ఓ ప్రభువా)

 

4.. దోషిని నేను నీకు సఖులకు – అడుగుచుంటిని మన్నన మిమ్ము

కడుగుము నీదు రక్తములోన(ఓ ప్రభువా)

 

5.. ఐక్యతయే నా యభిలాష -నాదు చేదును

 తొలగించుము శత్రుని శక్తిని ఓడించుము(ఓ ప్రభువా)

 

6.. పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా – వడివేలు నీదు ఉజ్జీవము నిమ్ము

బూడిద చేయుము నాలోని మష్టున్ (ఓ ప్రభువా)

 

7.. ఆత్మ ఉజ్జీవ జ్వాలలు జగమున- కదలింపగ వ్యాపింప జేయుము

 

హృదయము ఫలియింప చేయుము(ఓ ప్రభువా)