ఓ నా ప్రాణమా పాట

ఓ నా ప్రాణమా పాట

పల్లవి. ఓనా ప్రాణమా నీకు తొందరేల

నా యేసురాజు నీ చెంతనుండగా

నా యేసు ప్రభువును సన్నుతించుమా

1.. నీ హ్రుదయ వాంఛలన్ని ఎరిగియున్నవాడు

శ్రేష్ఠమైన దీవెనలు నీ కొసగినాడు               

 పరమ కుమ్మరి యేసునాధుడు నిన్నెన్నడు                ఎడబాయడు                              

జీవజలముతో నిన్ను తృప్తిపరచువాడు

2.. నీవు నడుచు మార్గములను ఎరిగియున్నవాడు

నిను విడువక ఎడబాయక కాపాడువాడు

విరిగిన నలిగిన హృదయమును,బహుగా ప్రేమించువాడు     

 

 రక్షణ ఆనందమును నీకు కలుగజేయును.