ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమానీ

ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా (2)

నీ బ్రతుకంతా మారుటే మేలు

కోరుము జీవమునే         ||ఓ క్రైస్తవ||

 

పాపపు చీకటి బ్రతుకేలా

శాపము భారము నీకేలా (2)

పావన యేసుని పాదము చేరిన

జీవము నీదగురా       ||ఓ క్రైస్తవ||

 

మారిన జీవిత తీరులలో

మానక నీప్రభు సేవకురా (2)

మహిమ కిరీటము మనకొసగును

ఘనమే నీదగురా       ||ఓ క్రైస్తవ||

 

భయపడి వెనుకకు పరుగిడక

బలమగు వైరిని గెలిచెదవా (2)

బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన

 

గెలుపే నీదగురా          ||ఓ క్రైస్తవ||