ఓ క్రైస్తవుడా – సైనికుడా – బలవంతుడా – పరిశుద్ధుడా

ఓ క్రైస్తవుడా – సైనికుడా – బలవంతుడా – పరిశుద్ధుడా

కదలిరావోయ్ – నీవు కదలిరా

 జాలరి మనుష్యుల పట్టు జాలరీ … ఆత్మల కాయు కాపరీ

 అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి

1.. సిలువే నీ స్థావరము – శ్రమలే నీ సైన్యము

సహనమే నీ ధైర్యము – సాక్ష్యమే నీ సైన్యము

2.. త్యాగమే నీ క్షేమము – ప్రార్థనే నీ యవ్వనము

వాక్యమే నీ బాణము – విశ్వాసమే ఉద్యమము

3.. సత్యమే నీ గమ్యము – సమర్పనయే నీ శీలము

యేసే నీ కార్యక్రమము – ప్రేమే నీ పరాక్రమము

4.. దేశంలో విదేశం లో – గ్రామంలో కుగ్రామంలో

అడవులలో కొండలలో – పనిఎంతో ఫలమెంతో

5.. జయించి లే శరీరాన్ని – ధరించుకో శిరస్త్రాన్ని

బంధించు విషపు సర్పాన్ని – బోధించు యేసు పథకాన్ని

6.. సిద్ధాంతపు గట్టు దుమికిరా – సాకులనే మెట్టులు దిగిరా

దీనుడా కాదు ధన్యుడా – విదేయుడా అజేయుడా

7.. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో – అధ్వాన్నపు అడవి

దాటి ముందుకు పో  నీ ఇల్లే పెనూయేలు – నీ పేరే ఇశ్రాయేలు

8.. సంఘమే నీ రంగ స్థలం – సహవాసమే నీ స్థానము

 

 ఏసే  నీ నాయకుడు – శుద్దాత్ముడే దర్శకుడు