ఒడ్డు చేరి నీ యెదుట

ఒడ్డు చేరి నీ యెదుట – నిల్పునపుడు రక్షకా

ఒక యాత్మనైన తేక సిగ్గుపడి పోదువా

 

1. ఒక యాత్మనైన నేను – రక్షింపక యేసువా1

వట్టి చేతులతో నిన్ను – దర్శించుట తగునా

 

2 . ఆత్మలందు వాంచలేక – సోమరులై కాలమున్

వ్యర్థ పర్చు వారానాడు – చింత తోడ నిల్తురు

 

3. యేసువా నా స్వరక్షణ – నిశ్చయంబు యైనదే

ఐనా పలితంబు జూడ – కష్టపడనైతినే

 

4.  కాలమెల్ల  గడ్చిపోయెన – మోసపోతినేనయ్యో

గడ్చినట్టి కాలమైతే  – ఏడ్చినను రాదది

 

5.  భక్తులారా దైర్యం తోడ – లేచి ప్రకాశించుడి

 

ఆత్మ లెల్ల యేసు నొధ్ద – చేరునట్లు చేయుడి