ఒక వరమడిగితిని యేసయ్యా

ఒక వరమడిగితిని యేసయ్యా

నీలా ఉండాలని మండుచుండాలని

నీలా ఉండాలని మండుచుండాలని (2)

యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)       ||ఒక వరమడిగితిని||

 

నాలో నేరము స్థాపించగలరా

ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో (2)

నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు

నీ మార్గములలో నడిపించవా (2)      

||ఒక వరమడిగితిని||

 

సర్వ సృష్టికి సర్వాధికారి

తల వాల్చుటకును స్థలమింత లేదా (2)

నేను లోకాశ విడచి పైనున్నవాటి

గురి కలిగి వెదకి పొందాలని (2)      

||ఒక వరమడిగితిని||

 

తండ్రిని విడచి పారమును వీడి

నన్ను సమీపించినావు (2)

నేను కలిగున్నదంత నీ పాదాల చెంత

అర్పించి నీ చెంత చేరాలని (2)      

||ఒక వరమడిగితిని||

 

దేవుని చిత్తము సంపూర్తి చేయగ

సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు (2)

నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో

 

నీ సాక్షిగా జీవించాలని (2)