ఒక వరమడిగితిని యేసయ్యా

ఒక వరమడిగితిని యేసయ్యా
నీలా ఉండాలని మండుచుండాలని
నీలా ఉండాలని మండుచుండాలని (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)       ||ఒక వరమడిగితిని||

నాలో నేరము స్థాపించగలరా
ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో (2)
నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు
నీ మార్గములలో నడిపించవా (2)       ||ఒక వరమడిగితిని||

సర్వ సృష్టికి సర్వాధికారి
తల వాల్చుటకును స్థలమింత లేదా (2)
నేను లోకాశ విడచి పైనున్నవాటి
గురి కలిగి వెదకి పొందాలని (2)       ||ఒక వరమడిగితిని||

తండ్రిని విడచి పారమును వీడి
నన్ను సమీపించినావు (2)
నేను కలిగున్నదంత నీ పాదాల చెంత
అర్పించి నీ చెంత చేరాలని (2)       ||ఒక వరమడిగితిని||

 

దేవుని చిత్తము సంపూర్తి చేయగ
సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు (2)
నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో
నీ సాక్షిగా జీవించాలని (2)       ||ఒక వరమడిగితిని||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *