ఒక్క క్షణమైన నను వీడిన

ఒక్క క్షణమైన నను వీడిన

నీనేమౌదునో తెలియదయ్యా

ప్రభు నీతోడు నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా

1.అపవాది శోధనలు నను చుట్టినా ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా

ఆశ్రయమైన నిను వెంబడించి

నేనిల బ్రతుకుచున్నానయ్యాIIఒక్కII

2.కునుకక ఎన్నడు నిద్రించక నీ కనుపాపవలె కాచేడివాడవు

కాపరియైన నీ మందలో

నీనిల బ్రతుకుచున్నానయ్యాIIఒక్కII

3.ఈ క్షణము వరకిల కాపాడిన నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై

నిన్ను స్తుతియించుచు కొనియాడుచు

నీనిల బ్రతుకుచున్నానయ్యాIIఒక్కII