ఒకని తల్లి ఆదరించునట్లు

ఒకని తల్లి ఆదరించునట్లు

నను ఆదరించిన నా దేవుడు (2)

హీనుడనైనా బలహీనుడనైనా

కురూపినైనా కఠినుడనైనా (2)       ||ఒకని||

 

ఒకసారి నేను నీ మందనుండి

నే తప్పిపోయిన వేళ (2)

నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2)

నీ చంకపెట్టితివా యేసయ్యా (2)     

||ఒకని||

 

నీ సన్నిధినుండి నే దూరమవగా

చిక్కాను దొంగ చేతిలోన (2)

నను దోచిపోగా నను దాటిపోగా (2)

బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2)      

||ఒకని||