ఒకని తల్లి ఆదరించునట్లు తల్లి

ఒకని తల్లి ఆదరించునట్లు
నను ఆదరించిన నా దేవుడు (2)
హీనుడనైనా బలహీనుడనైనా
కురూపినైనా కఠినుడనైనా (2)       ||ఒకని||

ఒకసారి నేను నీ మందనుండి
నే తప్పిపోయిన వేళ (2)
నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2)
నీ చంకపెట్టితివా యేసయ్యా (2)      ||ఒకని||

 

నీ సన్నిధినుండి నే దూరమవగా
చిక్కాను దొంగ చేతిలోన (2)
నను దోచిపోగా నను దాటిపోగా (2)
బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2)       ||ఒకని||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *