ఒంటరివి కావు ఏనాడు నీవు

ఒంటరివి కావు ఏనాడు నీవు

నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2)

ఆలకించవా ఆలోచించావా

ఆనందించవా (2)         ||ఒంటరివి||

 

వెలివేసారని చింతపడకుమా

ఎవరూ లేరని కృంగిపోకుమా

ఒంటరితనమున మదనపడకుమా

మంచి దేవుడు తోడుండగా (2)

ఆత్మహత్యలు వలదు

ఆత్మ ఆహుతి వలదు (2)         

||ఆలకించవా||

 

బలము లేదని భంగపడకుమా

బలహీనుడనని బాధపడకుమా

ఓటమి చూచి వ్యసనపడకుమా

బలమైన దేవుడు తోడుండగా (2)

నిరాశ నిస్పృహ వద్దు

సాగిపోవుటే ముద్దు (2)           

 

||ఆలకించవా||