ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)           ||ఏ బాధ||

ఎర్ర సంద్రం ఎదురొచ్చినా
యెరికో గోడలు అడ్డొచ్చినా
సాతాను శోధించినా
శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా            ||దిగులేల||

పర్వతాలు తొలగినా
మెట్టలు తత్తరిల్లినా
తుఫానులు చెలరేగినా
వరదలు ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగా
నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే కదా          ||దిగులేల||

ఏ వైపు చూసినా యుద్ధ వార్తలేగా
ఎటు వైపు తిరిగినా ఆర్తనాదమేగా (2)
జనముల మీదికి జనములు
రాజ్యము మీదికి రాజ్యము (2)
ఇవన్ని దేనికి సూచకము?
రాకడ రెండవ రాకడ
రాకడా నా యేసు రాకడ (2)

 

వచ్చాడు మొదటిసారి పాపులందరిని
రక్షించడానికి
వస్తున్నాడు రెండవసారి దోషులందరిని
శిక్షించడానికి (2)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *