ఎవడండి బాబూ వీడు – ఎంత చెప్పినా వినడు

ఎవడండి బాబూ వీడు – ఎంత చెప్పినా వినడు

గుప్పుగుప్పున వదిలేస్తాడు – తప్పంటే అసలొప్పుకోడు

 

1.      తాగొద్దురా అంటే నీకు ఎవరు చెప్పారు అంటాడు

పీల్చొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమాంటాడు

దాన్ని చేసినోడే రాసిన హెచ్చరిక మరిచేడు

గుండె తూట్లు పడ్డగాని దాన్ని మాత్రం విడువడు

 

2.      సరదా అంటూ మొదాలుపెడతాడు మల్లా దానికే బానిసౌతాడు

డబ్బులన్ని తగలబెడతాడు కోరి జబ్బులెన్నో తెచ్చుకుంటాండు

ఆరోగ్యమే క్షిణిస్తున్నా కళ్ళు మాత్రం తెరవడు

శక్తి అంతా కోల్పోతున్నా ఎంతమాత్రం వెరవడు

 

3.      దేహమే దేవదేవుని నివాసమని మర్చిపోతాడు

పరిశుద్దంగ ఉంచుమనే క్రీస్తు ఆజ్ఞనే లెక్కచేయడు

పాడు వ్యసనములతోనే నరకమునకు పోతాడు

యేసుక్రీస్తుని నమ్మినచో పరిశుద్ధుడు తానౌతాడు