ఎల్లవేళలందు యెహోవా నాదు కాపరి

ఎల్లవేళలందు యెహోవా నాదు కాపరి

ఎంత ఎప్పుడైనా నాతోనే నడచుగా మరి

నిస్తేజం నిర్వేదం నాదరికి రావు

నైరాశ్యం వైరాగ్యం నన్ను గెలువలేవు

ప్రతిదినం ప్రతిక్షణం ప్రభుకృప తోడున్నది

ఆయనలో ఆశకు ఆధారమున్నది

1. బెదిరించే శత్రువు బలవంతుడైనగాని

ఎదురు నిలుచు పరిస్థితులు ఎంతవరకు రాని

విశ్వాసముంచి నేను ఎదురు నిలువగానే

చెంతనుండి వింతగాను విజయమిచ్చు తానే

2. ఆవరించు అగ్ని జ్వాలలెగసిప్డగాని

ఆకలిగొని సింహము ఎదురుగవచ్చిన రాని

అదరక మరి బెదరక ప్రభు స్మరణ చేయగానే

ఆపదలను బాపి కాపుదలనిచ్చును తానే