ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా

నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)

హల్లెలూయ హల్లెలూయ

హల్లెలూయ హల్లెలూయ (2)      ||ఎన్నో||

 

బాధలలో మంచి బంధువువైనావు

వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)

చీకటి బ్రతుకులో దీపము నీవై

పాపములన్నియు కడిగిన దేవా (2)

నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా

నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)           ||ఎన్నో||

 

శోధనలో సొంత రక్షకుడైనావు

శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)

హృదయ వేదన తొలగించినావు

కృపా క్షేమముతో నడిపించినావు (2)

నా కోసం భువికొచ్చిన దైవ మానవా

 

నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)      ||ఎన్నో||