ఎన్ని తలచినా ఏది అడిగినా

ఎన్ని తలచినా ఏది అడిగినా

జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా

నీ వాక్కుకై వేచియుంటిని

నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా

 

నీ తోడు లేక నీ ప్రేమ లేక

ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)

అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)

నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా      ||ఎన్ని||

 

నా ఇంటి దీపం నీవే అని తెలసి

నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)

ఆరిపోయిన నా వెలుగు దీపము (2)

వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా      ||ఎన్ని||

 

ఆపదలు నన్ను వెన్నంటియున్నా

నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)

లోకమంతయూ నన్ను విడచినా (2)

నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా      ||ఎన్ని||

 

నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి

నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)

నీదు యాగమే నా మోక్ష మార్గము (2)

 

నీయందే నిత్యజీవము (2) ప్రభువా         ||ఎన్ని||