ఎన్నినాళ్ళ గమనమో – ఎంతదూరమో పయనమోఈ ధరిత్రిలోన

ఎన్నినాళ్ళ గమనమో ఎంతదూరమో పయనమోఈ ధరిత్రిలోన నీ బ్రతుకు దినము లెన్నియో ॥ఎన్ని॥

1.      గడ్డిపువ్వు వంటింది భూనివాస జీవితంఎంతలోన విరియునో అంతోనే వాడును ॥ఎన్ని॥

2.      నీటి మీద లేచిన అవిరంటి బ్రతుకాయేక్షణము కూడ నిలువదు గాలిలోనే కలియును ॥ఎన్ని॥

3.      చేదనుండి జూరెడి నీటి బిందు బ్రతుకాయేజారుచున్న బిందువు ఎవరి తరము నిలుపగా ॥ఎన్ని॥

4.      త్రాసుమీద దూళిలా ఎగిరిపోవు జీవితంకలలుకన్న జీవితం కలిసిపోయె నేలలో ॥ఎన్ని॥

5.      నీటిమీద తేలిన బుడగవంటి బ్రతుకాయేఎపుడు పగిలిపోవునో ఏ నరునికి తెలియదు ॥ఎన్ని॥

6.     యేసే సత్యమార్గము యేసే నిత్యజీవముయేసు నమ్మువారికి నిత్యజీవ మొసుగును ॥ఎన్ని॥