ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ

ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ (2)
నన్నెంతగానో బలపరచెను
నన్నెంతగానో స్థిరపరచెను (2)
నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను
నన్నెంతగానో స్థిరపరచెను (2)        ||ఎడబాయని||

కన్నీటి లోయలలో నుండి
నన్ను దాటించిన దేవా
సింహాల బోనులలో నుండి
నన్ను విడిపించిన ప్రభువా (2)       ||నన్ను బలపరచెను||

నేనున్నతమైన స్థితిలో
ఉండాలని ఆశించితివా
ఏ అర్హత నాకు లేకున్నా
నా కృప నీకు చాలునంటివే (2)       ||నన్ను బలపరచెను||

నేనెదుర్కొనలేని పరిస్థితులు
నా ఎదుట ఉన్నవి దేవా
నీ శక్తిని నేను కోరెదను
నన్ను విడిపించు నా దేవా (2)       ||నన్ను బలపరచెను||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *