ఎటు చూచినా యుద్ధ సమాచారాలు

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు

ఎటు చూచినా కరువు భూకంపాలు

ఎటు చూచినా దోపిడి దౌర్జన్యాలు

ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు

ఓ సోదరా సోదరీ రాకడ గురుతులని తెలుసుకో

తినుటకు త్రాగుటకు ఇది సమయమా

1.      మందసం ఈ ప్రజలు గుడారములో నివసిస్తుండగా

యోవాబు నీ సేవకులు దండులో ఉండగను

తినుటకు త్రాగుటకు భార్య తో ఉండుటకు

ఇది సమయమా ఇది సమయమా అని

ఆనాడు ఊరియా దావీదు నడిగాడు

ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||

2.      నా పితరులు యొక్క సమాధులుండు పట్టణము

పాడైపోయెను పాడైపోయెను

యెరుషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా

సంతోషముగా ఉండుటకు ఇది సమయమా అని ఆనాడు

నెహమ్యా ఫరో రాజునడిగాడు

 

ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||