ఎక్కరా ఓరన్నా రక్షణ పడవ

ఎక్కరా ఓరన్నా రక్షణ పడవ

చక్కగా మోక్షానికి చేర్చేటి నావ

 

1.      తండ్రియైున దేవుడు నిర్మించినాడురా

యేసుక్రీస్తు దేహాన్ని మలిచి కట్టినాడురా

పరిశుద్ద రక్తంతో సిద్దామైన పడవరా

దరిచేర్చగలిగిన ఏకైక నావరా

 

2.      ఎందరెక్కినా దానిలో చోటుంటుందిరా

అందారిని ప్రేమతో రమ్మంటుందిరా

నిత్యజీవాన్నిచ్చే నిజమైన పడవరా

సత్యమైన మార్గాన సాగేటినావరా

 

3.      శాపాలు పాపాలు దానిలోకి చేరవురా

చావు భయమే అందు మరి ఉండబోదురా

శిక్ష నుండి తప్పించే మహిమగల పడవరా

 

అక్షయ భాగ్యమిచ్చే అనురాగ నావరా