ఎందుకో నన్ను నీవు ప్రేమించినావు దేవా ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు

ఎందుకో నన్ను నీవు ప్రేమించావు దేవా

ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా

నీ కృపను బట్టి ఉత్సాఅహగానము చేసేదనో దేవా (2)

హల్లెలూయా యెహోవ యీరే హల్లెలూయా యెహోవ రాఫా

హల్లెలూయా యెహోవ షాలోమ్ హల్లెలూయా యెహోవ షమ్మా          ||ఎందుకో||

 

నాకు బదులుగా నాదు శిక్షను నీవు భరియించావు

పాతాళ వేదన శ్రమలనుండి

నన్ను విడిపించావు (2)         ||నీ కృపను||

 

నే కృంగియున్న వేళలో నీవు కరుణించావు

నా గాయములను బాగు చేయ

నీవు శ్రమనొందావు (2)         ||నీ కృపను||

 

నీ బండపైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావు

పరలోక పరిచర్య భాగస్వామిగా

 

నన్ను స్వీకరించావు (2)         ||నీ కృపను||