ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ

ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ

పాపిని నాకొరకు నీకు ఏల సిలువ శ్రమ

 

1.      శ్రీమంతుడవు సిరికే రాజువు

ప్రార్థించినంతనే కృప చూపువాడవు

కడుదీనుడవై మరియ సుతుడవై

పశుల శాలలో జన్మించినావా – నాకై ఇంత తగ్గించుకున్నావా

 

2.      న్యాయము జరిగించు శాసనకర్తవు

న్యాయాధిపతిగా రానున్నవాడవు

లోకాధికారుల తీర్పుకు తలవంచి

 

దొంగల నడుమ మరణించినావా-నాకై ఇంత తగ్గించుకున్నావా