ఎంత సుందారమో ఆ పరలోకము

ఎంత సుందారమో ఆ పరలోకము

అంతా సువర్ణమే ఏమి చిత్రము

చేరాలనుకుంటే ఆ పట్టణము

యేసయ్యకివ్వాలి నీ హృదయము

1.      కాంతి నిచ్చుటకు సూర్యుడు అవసరమే లేదు

వెన్నెలిచ్చుటకు చంద్రుడు అవసరమే లేదు

దేవుని మహిమయె అచట ప్రకాశించుచుండును

జనములు ఆ వెలుగునందు సంచరించుచుందురు

2.      ఆకలి దాహము ఉండనే ఉండవు

చీకటి రోగము ఉండనే ఉండవు

ప్రభువైన దేవుడే వారితో నివసించును

కన్నీటి బిందువులను తానే తుడిచి వేయును

3.      శాపగ్రస్తమైనదేది అందులో ఉండదు

అసహ్యమైనది ఏది అందులో ఉండదు

జీవగ్రంథామందు రాయబడినవారే ఉందురు

 

ఆయనను సేవించుచు రాజ్యమే చేతురు