ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా

ఎంత మంచి దేవుడవయ్యా

ఎంత మంచి దేవుడవేసయ్యా

నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరగా

ఎంత మంచి దేవుడవేసయ్యా (2)        ||ఎంత||

 

ఘోరపాపినైన నేనూ నీకు దూరంగా పారిపోగా (2)

నీ ప్రేమతో నన్ను క్షమియించి (2)

నను హత్తుకొన్నావయ్యా        ||ఎంత||

 

నాకున్న వారందరూ నను విడచిపోయిననూ (2)

నాకెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ (2)

నను నీవు విడువలేదయ్యా       ||ఎంత||

 

నీవు లేకుండ నేనూ ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)

నీతో కూడా ఈ లోకం నుండీ

 

పరలోకం చేరెదనేసయ్యా (2)      ||ఎంత||