ఎంత దూరమైనా అది ఎంత భారమైన

ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2)

యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2)

తీరానికి చేరు (2)        ||ఎంత||

 

నడచి నడచి అలసిపోయినావా

నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2)

కలువరి గిరి దనుక సిలువ మోసిన

నజరేయుడేసు నీ ముందు నడవగా (2)        ||యేసు||

 

తెలిసి తెలిసి జారిపోయినావా

తెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2)

నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే

 

పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2)        ||యేసు||