ఎంత దీనాతి దీనమొ యేసయ్యా

ఎంత దీనాతి దీనమొ  యేసయ్యా

నీ జననమెంతో దయనీయమో

తలుచుకుంటే నా గుండే తడబడి కరిగి కరిగి నీరగుచున్నది.

 

1.      ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా

ఆ సత్రములో ఓ యేసయ్య నీకు స్ధలమే దొరకలేదయ్య (ఎంత)

 

2.      నిండు చూలాలు  మరియమ్మ తల్లి నడవలేక సేడివడి పోయెనయ్యా

దిక్కుతోచక ఓ యేసయ్య పశువు పాకలొ ప్రసవించెనయ్యా (ఎంత)

 

3.      చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టేనయ్యా

 

పసికందువై ఓ యేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్య (ఎంత)