ఎంత గొప్ప దేవుడే ఎన్ని సిత్రాలు సేసినాడే

ఎంత గొప్ప దేవుడే ఎన్ని సిత్రాలు సేసినాడే

ఇంత ఇంతని ఆయన వింతలు సాటలేను

 

1.      నీళ్లను ద్రాక్షారసముగ మార్చినాడే -వేలమందికాహారం కూర్చినాడే

నీటిపైన తాను నడచినాడే – గాలి సముద్రమును అణచినాడే

 

2.      గుడ్డోళ్ళు కళ్ళను తెరచినాడే -పక్షవాయువును బాగుపరచినాడే

కుటోంళ్ళను సక్కగ నడిపించినాడే – దయ్యాలనుండి విడిపించినాడే

 

3.      చనిపోయిన లాజరును లేపినాడే

సమరయ స్త్రీ పాపమును బాపినాడే

సిలువపై ప్రాణమును విడిచినాడే

 

సమాధిని గెలిచి మరల లేచినాడే.