ఎంతో వింత ఎంతో చింత -యేసునాధున్ మరణమంత

ఎంతో వింత యెంతో చింత

యేసునాధు మరణ మంత (2)

పంతము తో జేసి రంత

సొంత ప్రజలు స్వామి నంత (2)      ||ఎంతో||

 

పట్టి కట్టి నెట్టి కొట్టి

తిట్టి రేసు నాధు నకటా (2)

అట్టి శ్రమల నొంది పలుక

డాయె యేసు స్వామి నాడు (2)       ||ఎంతో||

 

మొయ్యలేని మ్రాను నొకటి

మోపి రేసు వీపు పైని (2)

మొయ్యలేక మ్రాని తోడ

మూర్చబోయే నేసు తండ్రి (2)      ||ఎంతో||

 

కొయ్యపై నేసయ్యన్ బెట్టి

కాలు సేతులలో జీలల్ (2)

కఠిను లంత గూడి కొట్టిరి

ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2)      ||ఎంతో||

 

దాహము గొన చేదు చిరక

ద్రావ నిడిరి ద్రోహు లకటా (2)

ధాత్రి ప్రజల బాధ కోర్చి

ధన్యుడా దివి కేగె నహహా (2)      ||ఎంతో||

 

బల్లెముతో బ్రక్కన్ బొడవన్

పారే నీరు రక్త మహహా (2)

ఏరై పారే యేసు రక్త

 

మెల్ల ప్రజల కెలమి నొసగు (2)      ||ఎంతో|