ఎంతో నమ్మదగిన దేవుడవు నీవు

ఎంతో నమ్మదగిన దేవుడవు నీవు

సంతోషమునకే కారణభూతుడవు

కొంతైనా కునుకవు నా చేయి వీడవు

వింతైన ప్రేమతో నన్నాదరించుదువు

 

1.      లోకులంతా ఏకమై నను వెలివేసినా

శోకమెంతో భారమై నను కృంగదీసినా

నీవు నాలో ఉన్నావని నన్ను నడిపిస్తున్నావని

ఎరిగి ధైర్యము పొంద నాకు శక్తినీవయ్యా

 

2.      మరణపాశము మమ్ము  చుట్టి ఏడిపించినా

మాకు ప్రియులే మమ్ము విడిచి నిన్ను చేరినా

మరల వచ్చి మమ్ము లేపి పరమునకు కొనిపోతావని

నిరీక్షణతో దుఃఖపడకుండగజేయుమయ్యా