ఎంతెంత భారమాయె ఆ సిలువ

ఎంతెంత భారమాయె ఆ సిలువ

లోక పాపములన్ని నువ్వు గెలువ (2)

కదిలినావు ఆ కల్వరికి

మరణముని దరి చేర్చుకొని (2)

యేసయ్యానా యేసయ్యా

అలసిపోతివ నా యేసయ్యా… (2)

 

కొరడాలు నీ ఒళ్ళు చీల్చేను

పిడి గుద్దులతో కళ్ళు తిరిగెను (2)

వడి ముళ్ళు తలలోన నాటేను

నీ కళ్ళు రుధిరాన్ని కురిసెను (2)           ||యేసయ్యా||

 

బరువైన సిలువను మోయలేక

తడబడె నీ అడుగు అదిరిపడి (2)

వడివడిగా నిన్ను నడువుమని

పడి పడి తన్నిరి ఆ పాపులు (2)      ||యేసయ్యా||

 

చల్లని నీ దేహమల్లాడెను

ఏ చోటు లేకుండ గాయాలతో (2)

కాళ్ళు చేతులకు దిగి మేకులు

వ్రేళాడే సిలువకు నీ ప్రాణము (2)        ||యేసయ్యా||

 

వెలలేనిది తండ్రి నీ త్యాగము

నీ కష్టమంతయు నా పాపము (2)

మదిలోన కొలువుండు నా రక్షకా

 

వదిలేది లేదు నిన్ను నా పాలిక (2)            ||యేసయ్యా||