ఊహించలేని మేలులతో నింపిన

ఊహించలేని మేలులతో నింపిన

నా యేసయ్యా నీకే నా వందనం (2)

వర్ణించగలనా నీ కార్యముల్

వివరించగలనా నీ మేలులన్ (2)       ||ఊహించలేని||

 

మేలుతో నా హృదయం తృప్తిపరచినావు

రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)

ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా

స్తుతియింతును నీ నామమున్ (2)     ||ఊహించలేని||

 

నా దీనస్థితిని నీవు మార్చినావు

నా జీవితానికి విలువనిచ్చినావు (2)

నీ కృపకు నన్ను ఆహ్వానించినావు

 

నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2)   ||ఊహించలేని||