ఊహించలేనయ్యా వివరించలేనయ్యా

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా

ఎనలేని నీ ప్రేమను (2)

నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)

తరియించు వరమే దొరికెను (2)        ||ఊహించ||

 

1.నా మనసు వేదనలో నాకున్న శోధనలో

ఉల్లాసమే పంచెను

ఓ మధుర భావనలో తుదిలేని లాలనలో

మధురామృతమునే నింపెను (2)

అనాథయిన నను వెదకెను

ప్రధానులలో ఉంచెను (2)        ||ఊహించ||

 

2.నీ మరణ వేదనలో నీ సిలువ శోధనలో

నీ ప్రేమ రుజువై నిలిచెను

వెలలేని త్యాగముతో అనురాగ బోధలతో

నా హృదయమే కరిగెను (2)

ఇది నీ ప్రేమకే సాధ్యము

వివరించుట నాకసాధ్యము (2)        ||ఊహించ||