ఊహలకందనిది నీ త్యాగం –

ఊహలకందనిది నీ త్యాగం – వర్ణింపజాలనిది

ఊసులకందనిది నీ యాగం – వివరింపజాలనిది

నీ కొరకే ఆ త్యాగం – మన కొరకే బలయాగం

ఎంత ప్రేమయ్యా యేసు – వింత ప్రేమయ్యా(2)”ఊహల”

 

1.ఎవరూ చూపని నీ ప్రేమ – నాకై చూపిన నా దేవా

ఎవరూ చేయని ఆ త్యాగం – నాకై చేసిన నా ప్రభువా

ఏమని వర్ణింతును – ఏమని వివరింతును

నీ గొప్ప త్యాగాన్ని యేసు ఆ గొప్పయాగాన్ని(2)”ఊహల”

 

2.నాలో మంచి లేదనియు – తెలిసి తనయునిగా పిలచి

ఎంచలేని మంచిని – నాలో పెంచాలని యెంచి

యాగమై బలియాగమై – త్యాగమై ప్రాణ త్యాగమై

నాకై మరణించినా యేసు – నన్ను బ్రతికించినా యేసు(2)”ఊహల