ఉన్నత స్థలముపై- నెక్కించి

ఉన్నత స్థలముపై- నెక్కించి చూపించు ప్రభు

ఎన్నతగిన మహరక్షణ శిఖరము-సుందర మెుందు సదా

1.మరణము మ్రింగబడె – ఘన విజయము ప్రాప్తమాయె

మరణము ముల్లును విరచి జయంబును- యేసు అననగ్రహించెను

2.ఎవరు మనస్సు ప్రభుపై- నిశ్చలముగ నిల్పెదరో

దైవ శాంతినొంది క్రీస్తుతో నిలచి- సంతస మొందెదరు(ఉన్నత)

3.ఆశ్చర్యకరుడాయనే – ఆలోచన కర్తయును

నిశ్చయుగా బహుబుద్ది వివెకము- లిచ్చి నడుపు సదా(ఉన్నత)

4.చంచల హృదయులును – ముష్కరులగు పాపులును

వంచనలేక వాక్యమునకు తల- వంచి విధేయులౌదురు (ఉన్నత)

5.కుడికి తిరిగిను – మరి యెడమకు తిరిగినను

నడువుడి త్రోవయిదేయను శబ్దము- చెవులకు వినబడును(ఉన్నత)

6.పక్షిరాజు తనదు- పిల్లల కాచెడు రీతి

రక్షణ కర్త యెహొవా నిన్ను- కాచి రక్షించు సదా(ఉన్నత)

7.సుందరమగు రాజున్- నీ కననలతో చుచెదవు

 

అందమైన యా పరలోక రాజ్యము- ప్రబలుట చూచెదవు.(ఉన్నత)