ఉన్నతమైన స్థలములలో

ఉన్నతమైన స్థలములలో  – ఉన్నతుడా మా దేవా

ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా  || ఉన్నత ||

1.చెదరి పోయినది మా దర్శనము – మందగించినది ఆత్మలభారం

మరచిపోతిమి నీ తొలిపిలుపు – నీ స్వరముతో మము మేలుకొలుపు

నీ ముఖకాంతిని ప్రసరింపచేసి – నూతన దర్శన మీయుము దేవా

నీ సన్నిధిలో సాగిలపడగా – ఆత్మతో మము నిలుపుము దేవా

| ఉన్నత|

2.పరిశోధించుము మా హృదయములను – తెలిసికొనుము మా తలంపులను

ఆయాసకరమైన మార్గము మాలో – వున్నదేమో పరికించు చూడు

జీవపు ఊటలు మాలోన నింపి – సేదదీర్చి బ్రతికించు మమ్ము

మా అడుగులను నీ బండపైన – స్థిరపరచి బలపరచుము దేవా

|ఉన్నత|

3.మా జీవితములు నీ సన్నిధిలో – పానార్పణముగా ప్రోక్షించెదము

సజీవయాగ శరీరములతో – రూపాంతర నూతన మనసులతో

నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము – నీ కృపచేత బలపడియెదము

 

లోకమున నీ వార్తను మేము – భారము తోడ ప్రకటించెదముఉన్నత