ఉన్నతమైన రాజ్యపువాసీ

ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యా

ఆ మహిమను విడిచావా

ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా

ఈ ధరణికి వచ్చావా

నీ జన్మ మనుజాళిపంట – సాతానుకే చితిమంట

నా జీవితమంతా నీ ప్రేమగీతి పాడుకుాం

1. మంచివారినే ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే

మంచికార్యములు చేయు స్వభావము మాలోపల కనరాదే

మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా

మహిమను విడిచావా – ధరణికి వచ్చావా

2. ప్రాణప్రదముగా ప్రేమించిన తన మిత్రుని కొరకైనా

ప్రాణము నిచ్చెడు వారిని ఇలలో ఎచా కనుగొనలేమే

గుణహీనుడైన మానవుని ఋణము చెల్లించదలిచావా

మహిమను విడిచావా – ధరణికి వచ్చావా

3. పొరుగువాడు కలిగున్నదానిని ఆశించుటయే తప్ప

ఇరుగుపొరుగులకు అక్కరలో సహాయము చేయగలేమే

పురుగువిం నరమాత్రునికి కరుణతో సర్వమిచ్చావా

 

మహిమను విడిచావా – ధరణికి వచ్చావా