ఈ లోక యాత్రలో నే సాగుచుండ

ఈ లోక యాత్రలో నే సాగుచుండ(2)

ఒకసారి నవ్వు ఒకసారి యేడ్పు(2)

అయినను క్రీస్తేసు నాతోడ నుండు(2)

1.జీవిత యాత్ర యెంతో కఠినము(2)

ఘోరాంధకార తుఫాను లున్నవి(2)

అభ్యంతరములు యెన్నెన్నో వుండు (2)

కాయువారెవరు రక్షించేదెవరు(2)(ఈలోకం)

2.హృదయము శుద్ది పరచుకొన్నాను నా చేతులెంతో పరిశుద్ధ పరచి

అనుకొనని రీతి అపవాదివచ్చి నా జీవితమును నిరాశపరచె(ఈలోకం

3.నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా అనుదినము నన్ను ఆదరించెదవు

నీతో ఉన్నాను విడువలేదనెడునీ ప్రేమ మధుర స్వరము విన్నాను(ఈలోక)

4.ఈ అనుభవముతో నేనడచు కొందు- ప్రియ యేసువైపు నేను చూచుచు

గతమునంత నేను మరచిపోయెదను- కన్నీరు తుడచు నా ప్రియ ప్రభువు(ఈలోక)

5.తోడైయుండెదను అంతము వరకు- నీవు విడువవు అందరు విడచినను

 

నూతన బలమును నా కొసగెదవు- నే స్థిరముగా ముండ నీ కోరిక యిదియే (ఈ లోక)