ఈ లోక యాత్రలో – ఈ స్వల్ప

ఈ లోక యాత్రలో – ఈ స్వల్ప మజిలీలో

నీ ప్రాణమే క్షణబంగురమనుకో – నీదువు నీకే ఆశాశ్వతమనుకో

1.ఆస్తిపాస్తులు నీకు నష్టమొచ్చినా – ఆప్తులంతా నిను విడచి వెళ్ళిపోయినా – బందువర్గమే నీకు దూరమైన

లోతు బార్య వలె నీవు వెనుదిరుగకు -లోకశాలకు నీవు లొంగిపోకూ

2.రాజువైనను రారాజువైనను –  రాజ్యాదికారమంతా నీకు ఉన్ననూ యోధుడైనను యుద్దశూరుడైనను

దావీదు రాజు వలె వెనుదిరుగకు – కామా వాంఛలకు నివు లొంగిపోకూ

3.రూపమున్ననూ లోకజ్ఞానమున్ననూ – అంగబలం అర్ధబలం నీకు ఉన్ననూ కీర్తి సంపదలు నికు ఎన్నో ఉన్ననూ

సోలోమోను రాజువలే వెనుదిరుగకు – అన్యదేవతలకు నీవు లొంగిపోకూ

4.కష్టమొచ్చినా నీకు నష్టమొచ్చినా – నిందలెన్ని పొరుగువారు నిపై మోపిన – శత్రుమూకలే నిన్ను చుట్టుముట్టినా

శిష్యుడైన పేతురు వలె వెనుదిరుగకు – క్రీస్తునేరుగనని నివు బొంకబోకు

5.క్రీస్తునేరుగని జనం ఇంకా ఉన్నారు – క్రీస్తు రాజ్య వార్త నీవు ప్రకటించుము – క్రీస్తు సన్నిధి నుండి పారిపోకుము

 

యోనా వలె నీవు వెనుదిరుగకు -దైవాజ్ఞలను నీవు దిక్కరించకు