ఈ లోకం నీది కాదు

ఈ లోకం నీది కాదు
– శాశ్వతము అసలు కాదు –
2ఈ జీవం నీది కాదు
– శాశ్వతము అసలు కాదు
– 2

1.నీ ధనము ఘనము మాయ
– నీ చదువు పదవి మాయ –
2నీకు ఉన్నవి అన్ని
క్షయము – ప్రభు యేసే నిత్యజీవం”ఈలోకం”

2.నీ అందము చందము
మాయ -నీ దేహము ప్రాణము మాయ
– 2 భాంధవ్యం అన్ని
క్షయము – ప్రభు యేసేఅక్షయము “ఈలోకం”

3.నీ తనువు మంటికి
మన్నై – పోవును ఎపుడో ఎరుగవు –
2ప్రభు చెంతకు
చేరుము ఇపుడే – ప్రభు రాజ్యం నీదిఅగును “ఈలోకం”

4.కనిపించేదంత మాయ కనుగొనుము నిత్య మోక్షం – 2 పరుగిడుమా ప్రభుని చెంతకు – ప్రార్ధించు రక్షణకొరకు
“ఈలోకం”

 

5. ప్రభు యేసు పరమునుండి – నీకొరకే భువికి వచ్చేన్ – 2కల్వరిలో ప్రాణము ఇచ్చి – మృత్యువునే గెల్చి లేచెన్”ఈలోకం”